వైకుంఠ ఏకాదశి కార్యక్రమానికి మంత్రికి ఆహ్వానం పలికిన మానేపల్లి గోపికృష్ణ మురళీకృష్ణ
మెయిన్ రోడ్ నుండి ఆలయం వరకు రోడ్లు వేయాలని విజ్ఞప్తి
యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 21 సమర శంఖమ్
యాదాద్రి తిరుమల దేవస్థానం స్వర్ణ గిరి ఆలయ చైర్మన్లు మానేపల్లి గోపికృష్ణ మురళీకృష్ణలు హైదరాబాదులోని రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జనవరి 10 2025 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంత్రిని ఆహ్వానం పలకడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి దంపతులను ఆశీర్వదించి , వైకుంఠ ఏకాదశికి రావాలని స్వామివారి శాలువాలతో సత్కరించి , ప్రసాదాన్ని అందజేసి కోరారు. అలాగే హైదరాబాద్ వరంగల్ మెయిన్ రోడ్ నుండి ఆలయానికి వచ్చే రోడ్డు ప్రమాదకరంగా ఉందని , వర్షాలు కురిసినప్పుడు రోడ్లు పూర్తిగా బుడదమయం కావడంతో బైకులపై వచ్చే భక్తులు ప్రమాదవశాత్తు జారిపడి గాయాల పాలవుతున్నారని , భక్తుల సౌకర్యార్థం రోడ్డును పునరుద్ధరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రోడ్లు వేయడానికి హామీ ఇచ్చారు.