రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తాటతీస్తా: ఏపీ సీఎం చంద్రబాబు
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక..
రాష్ట్రంలో రౌడీయిజానికి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలా చేయాలనుకున్న వారు రాష్ట్రం నుంచి పారిపోవలసిందేనన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై దాడులు ఎప్పుడూ దాడులు జరగలేదన్నారు. కానీ కేవలం వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షింబోమని హెచ్చరించారు. గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం.. ఆపేదే లేదన్నారు. సరిహద్దుల నుంచి రాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గడచిన ఐదేళ్లలో గంజాయి, డ్రగ్స్ పై ఎప్పుడైనా చర్చించారా అని ప్రశ్నించారు. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవన్నారు. గత ఐదేళ్లలో అసెంబ్లీలో బూతులు మాత్రమే విన్నామన్నారు. సోషల్మీడియాలో కూడా రెచ్చిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో బూతులు లేవన్నారు. కేవలం సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపారు.
ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసి తప్పించుకోవాలని చూస్తో వదిలిపెట్టం అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసును గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. రౌడీయిజం చేసి తప్పించుకుంటామంటే వదిలిపెట్టం అన్నారు. భూవివాదాలు పరిష్కరించేందుకు లాండ్ గ్రాభింగ్ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఎవరైన భూ కబ్జాలు చేస్తే తప్పించుకోలేదని తెలిపారు. హత్యారాజకీయల మరక అంటకుండా 40 ఏళ్లు రాజకీయాలు చేశానని అన్నారు. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసినా వారిపై ప్రజల్లో పోరాడామని తెలిపారు. మీ నియోజకవర్గాల్లో లాం అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత అని ఎమ్మెల్యేలకు సూచించారు. సాంకేతిక ఉపయోగించుకుని నేరాలను అదుపు చేస్తామన్నారు. పోలీసు యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తామని సీఎం తెలిపారు. సైబర్సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యమన్నారు. 26 సైబర్ స్టేషన్లను తీసుకువస్తున్నామని తెలిపారు.