టీచర్ల ఎమ్మెల్సీకి చివరి రోజు నామినేషన్ల వెల్లువ
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈ రోజైనా సోమవారం మొత్తం 16 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన పింగళి శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, ,సరోత్తం రెడ్డి,అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తూ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో ని ఎన్జీ కళాశాల మైదానం నుండి కలెక్టరేట్ వరకు బల ప్రదర్శన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ లు జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఇలా త్రిపాఠి కి నామినేషన్ పత్రాలు సమర్పించారు చివరి రోజైన నేటి వరకు మొత్తం ఎమ్మెల్సీకి పోటీలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 50 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.