— ఉపాధి హామీకి మొండి చేయి చూపిన బడ్జెట్
— కార్పొరేట్లకు రాయితీలు పేదలకు భారాలు మోపిన కేంద్ర బడ్జెట్
— గ్రామీణ పేదలను విస్మరించిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ రేపు జిల్లా వ్యాపిత నిరసన కార్యక్రమాలను తెలియజేయండి
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 , 65,345 లక్షలకోట్ల బడ్జెట్ లో గ్రామీణ పేదలకు రాయితీలను కట్ చేసి బడా కార్పొరేట్లకు రాయితీలను ఇచ్చిందని, పేదలకు, రైతాంగానికి సబ్సిడీలను తగ్గించడానికి నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని కేంద్రాలలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపునిస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచే గ్రామీణ ఉపాధి హామీ పనికి గత సంవత్సరం కేటాయించిన 86 వేల కోట్లను మాత్రమే బడ్జెట్లో చూపిందని, ఆహార భద్రతకు పెద్ద ఎత్తున కోత విధించిందని గత సంవత్సరం బడ్జెట్లో 2.75 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో 2.4 కోట్లకు కుదించింద అన్నారు. ఇది దేశంలో ఉన్న 24 కోట్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆవేదన వెలిబుచ్చారు. యూరియా సబ్సిడీని గత బడ్జెట్లో 1.19 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 1.18 లక్షల కోట్లకు కుదించిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్ల నిర్మాణం చేయడానికి గత బడ్జెట్లో 54,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 32,486 కోట్లకు కుదించిందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కేటాయింపులు సంక్షేమ విద్యార్థుల స్కాలర్షిప్లు , ఫీజు రియంబర్స్మెంట్, సామాజిక పింఛన్లు అంగన్వాడీ కేంద్రాలకు నిధుల కేటాయింపు వంటి వాటి ఊసే లేదని, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరాకు గత బడ్జెట్లో 70 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి 67 వేల కోట్లకు కుదించిందని, మరొక పక్క ప్రభుత్వ భూములు అమ్మకం ద్వారా 10 లక్షల కోట్లను ఆదాయం సమకూర్చుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశమని తక్షణమే ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకొని, సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని నర్సింహ డిమాండ్ చేసినారు.