డాక్టర్ బిఆర్. అంబేద్కర్ స్పూర్తితో భారత రాజ్యాంగన్ని కాపాడుకుందాం.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 68 వర్ధంతి సందర్భంగా మనువాదుల నుండి, మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడు కుందామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు యాదగిరి, కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.శుక్రవారం రోజున స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో డాక్టర్ బిఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతు స్వాత్రంత్రo వచ్చి 76 ఏండ్లు దాటినా నేటికీ రాజ్యంగా ఫలాలు దళిత, గిరిజిన , పేదలకు సరిగా అందడం లేదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేసి రిజర్వేషన్ లేకుండా చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలని దానికోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో బిజెపి పాలనలో దళితులపైన దాడులు అత్యాచారాలు పెరిగి పోయాయాని ఆవేదనా వ్యక్తం చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్. అంబేద్కర్ స్పూర్తితో ఉద్యమాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లల పెంటయ్య, గంగాదేవి సైదులు, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment