తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు.