దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట

చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ సంతోషిమాత పుష్కర వార్షికోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్. లక్ష్మణ్ మాట్లాడుతూ ఘనంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బుధవారం సంతోష్ మాత అమ్మ వారికి విశేష పూజలు, గణపతి, నవగ్రహ, కల్ష పూజ, రక్షాబంధన , గణపతి వాహనం నిర్వహించారు. గురువారం వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సంతోష్ మాత అమ్మవారికి పంచామృత అభిషేకం , అలంకరణ, అనంతరం హోమం ,సామూహిక లలితా సహస్రనామ, 11 కేజీల కుంకుమ తో కుంకుమార్చన, విశేష మాల అలంకరణ, గాజుల అలంకరణ కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వాన మేరకు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఊరే లక్ష్మణ్ శ్రీదేవి దంపతులు ,ఆలయ ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. గోడకొండ్ల మాల్ వెంకటేశ్వరనగర్ అంటే తనకు ఎంతో అభిమానం అని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండూరు. భవాని పవన్ కుమార్ , మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, అంగరేకుల. విజయ గోవర్ధన్, అంగిరేకుల. గోపాల్,, రామిని .నగేష్ ,మద్దెల. కృష్ణ , మాజీ ఎంపీటీసీ. పాషా ,ఖలీల్,, రాజు, సురేష్ ,జగదీష్,, జంగయ్య, యాదయ్య, రహీం, శ్రీను, లౌక్య హాస్పిటల్ చైర్మన్ .డాక్టర్ లౌక్య రాజేష్,ఆలయ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు ,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, బండారు. సీతారాములు ,మాల్ శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు, తదితరులు ఉన్నారు. వందలాది మంది మహిళలు కుంకుమార్చన లో పాల్గొన్నారు. హోమ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఊరే లక్ష్మణ్ శ్రీదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంతి ఉపాధ్యాయులు శ్యాంసుందర్ దంపతులు, వ్యాపారస్తులు ఊరే. పద్మ ఈశ్వర్ దంపతులు, మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment