తెలంగాణ: ఆర్టీసీ డిపోలకు మహిళా శక్తి బస్సులు

తెలంగాణ: ఆర్టీసీ డిపోలకు మహిళా శక్తి బస్సులు

హైదరాబాద్, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:-మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి. మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే, తొలి విడతలో 150 మహిళా శక్తి బస్సులను సమకూర్చగా వాటిలో 20 బస్సులను వివిధ డిపోలకు కేటాయించారు.

ఇల్లందు, పరకాల, జనగామ,నర్సంపేట, భూపాల పల్లి, వరంగల్- 2, జగిత్యాల, హుస్నాబాద్, మంథని, హుజురాబాద్, వేములవాడ, మహబూబ్ నగర్, వనపర్తి డిపోలకు ఒక్కొక్క టి చొప్పున కేటాయించారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మహిళా బస్సులను ప్రవేపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి దశలో ఆర్టీసీ అధికారులు 150 మహిళ బస్సులను వివిధ డిపోలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రెండో విడతలో 450 మహిళ శక్తి బస్సులను కేటాయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment