రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఆదివారం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో ముందస్తు సమావేశం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై సమావేశం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) -రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం ఎ & యు డి – దానకిశోర్, GAD సెక్రటరీ రఘనంందన్ రావు,హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, రాష్ట్ర DGP డాక్టర్ జితేందర్, ADG, లా& ఆర్డర్ మహేష్ భగవత్, DG ఫైర్ నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు -సివి అనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ IG- కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి తదితరులు ఉన్నారు.
రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు
Published On: December 8, 2024 9:15 pm
