తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ప్రమాణస్వీకారం చేసిన ఆంక్ష రెడ్డి
తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంక్ష రెడ్డికి ఘన సన్మానం చేసిన మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీర్, గజ్వేల్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శి గాడి పల్లి శ్రీనివాస్ గజ్వేల్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నేత నాగరాజు ఈ సందర్భంగా మహమ్మద్ సమీర్ మాట్లాడుతూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఘనత ఆంక్ష రెడ్డి అని తండ్రి మాజీ ఎమ్మెల్యేగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకునే వీలు ఉన్న తీసుకోకుండా.
తన సొంత కష్టాన్ని నమ్ముకొని స్వశక్తితో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పోటీ చేసి మగవారికి ధీటుగా కొట్లాడి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికై గజ్వేల్ ప్రాంత పేరును నిలబెట్టడం జరిగిందని గజ్వేల్ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఇది గర్వ కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రజ్ఞాపూర్ సీనియర్ నాయకులు కన్న యాదవ్, లక్ష్మణ్, మహిళా నాయకురాలు సారిక రెడ్డి, మాజీ ఎంపీటీసీ పంజాల రాజు, శివులు, గాజుల శీను, తదితరులు పాల్గొన్నారు.