ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి మోడల్ పరీక్ష
డోన్, మార్చి 06, సమర శంఖం ప్రతినిధి:- అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని వివిధ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు టెన్త్ క్లాస్ మోడల్ ఎగ్జామ్ నిర్వహించి, 500 మంది విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలనీ, డోన్ పట్టణంలోని నిర్వహించిన 10వ తరగతి మోడల్ పరీక్షకు 500 మంది పరీక్షకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి మోడల్ పరీక్ష క్వెషన్ పేపర్ ను AISF, STU నాయకులు విడుదల చేశారని వారు తెలిపారు. పదవ తరగతి మోడల్ పరీక్ష ను రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులలో భయం వెళ్ళగొట్టేందుకు పబ్లిక్ పరీక్షల కంటే ముందు నిర్వహించడం జరుగుతూ ఉందని పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు చాలామందిలో భయం వెంటాడుతూ ఉంటుందని, ఆ భయాన్ని పోగొట్టి విద్యార్థులు పరీక్షలను ఫ్రీగా ఎలాంటి భయం లేకుండా రాసే విధంగా ముందస్తుగా ఇలాంటి పదవ తరగతి మోడల్ పరీక్షలు పెట్టడం వలన విద్యార్థులలో భయం వెళ్లిపోతుందని తెలిపారు.
ఇప్పుడున్న విద్యార్థులే రేపటి సమాజాన్ని మార్చే పౌరులుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకు మాత్రమే ఉందని తెలిపారు. ఈ సమాజాన్ని ఒక విద్యార్థి మార్చగలడని, ఈ సమాజాన్ని ఒక పెన్ను మార్చగలదని, ఈ సమాజాన్ని ఒక పుస్తకం మార్చగలదని, ఈ సమాజాన్ని ఒక టీచర్ మార్చగలడని, గతంలో మేధావులు చాలా మంది చెప్పేవారని గుర్తు చేశారు. ప్రతి ఒక విద్యార్థిని, విద్యార్థులు కూడా ప్రస్తుత విద్యాభ్యాసంలోనే చదువుతోపాటు ఈ సమాజంలో జరుగుతున్న అవినీతిని, ఏదైనా తప్పును కానీ ప్రశ్నించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
2025 లో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం మన జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండాలని, విద్యార్థులకు చదువుకోవాలని వారు విద్యార్థులను కోరారు.
ఈ కార్యక్రమంలో AISF మండల అధ్యక్ష కార్యదర్శులు శశిధర్ రెడ్డి, మనోజ్, మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్, అస్లాం, మహేష్, విష్ణు, మల్లీ, శుశిల్, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.