దాసరి మల్లయ్య కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందించిన తంగడపల్లి మాజీ సర్పంచ్ దయాకర్ చారి
చౌటుప్పల్ మే 02 సమర శంఖం :-
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లిలో దాసరి మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తంగడపల్లి మాజీ సర్పంచ్ ముటుకుల్లోజి దయాకర్ చారి శుక్రవారం మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గ్యార కృష్ణ, రాజరత్నం, జిట్ట కృష్ణ, అస్లాం తదితరులు పాల్గొన్నారు.