అరెస్టు చేసి అక్రమంగా జైల్లో పెట్టిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ కి పూలమాలవేసి వినతిపత్రం అందించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

– లగచర్ల రైతుల అరెస్టు ప్రజాస్వామికం…..

– సొంత భూములు అమ్మనందుకు, అల్లుడి ఫార్మా కంపెనీ స్థాపన కోసం రేవంత్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడడం నిస్సిగ్గు చర్య….

– రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ

– కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా 24 గంటల కరెంటు అన్నింటిని ఈరోజు ఆపేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది….

– రైతుల పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా నిర్లక్ష్యం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్…..

– లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరిని కి నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది…..

మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడి..

మునుగోడు నియోజకవర్గము:

చౌటుప్పల మున్సిపల్ కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు మాజీ శాసనసభ్యులు శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  పూలమాలవేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ లగచర్ల రైతులను అక్రమంగా జైల్లో వేసి నిరంకుశంగా వ్యవహరిస్తున్నందున వారిని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కి  వినతి పత్రం అందజేయడం జరిగింది….

అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అడుగడుగునా ప్రజాస్వామిక విధానాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుందని కచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు…..

రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని ఈరోజు ఆపేసి రైతులను మోసం చేస్తే కార్యక్రమానికి తెరలేపింది రేవంత్ రెడ్డి సర్కారు అని ఆయన పునరుద్ఘాటించారు….

రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు నిలిపివేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు….

రైతు భరోసా కింద ఇస్తానన్న 15 వేల రూపాయలు ఎగ్గొట్టారు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు…..

రైతుల పక్షాన ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని త్రిబుల్ ఆర్ రైతులకు కూడా అండగా ఉండి ఖచ్చితంగా వారి పక్క వారి పక్షాన పోరాటం చేస్తారు అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు……

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్, మరియు టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ మరియు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు……

Join WhatsApp

Join Now

Leave a Comment