మంథని: పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

మంథని: పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

మంథని, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- ఏప్రిల్ 15న మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 1975  ఇంటర్మీడియట్ చదువుకున్న బ్యాచ్ పూర్వ విద్యార్ధుల స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి కోరారు.

మంగళవారం మంథని పూర్వ విద్యార్థి యువత కార్యాలయంలో చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి అధ్యక్షతన పోరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్ని ఎప్రిల్ 15 వ తేదీన నిర్వహించే స్వర్ణోత్సవాల పోష్ఠర్లను ఆవిష్కరించారు.

అనంతరం ఆనాటి విద్యార్థులు మూడున్నర దశబ్దాల అపూర్వ సమ్మేళనం జరిగిన వైభవం గూర్చి వక్తలు ప్రశంషించారు. 250 మంది చదువుకున్న ఆనాటి విద్యార్థులు స్వర్ణోత్సవాలలో కుటుంబ సభ్యులతో హజరు కావాలని నిర్ణయించారు.

విద్యార్థి లోకం నాటి నుండి వర్తమాన దశ వరకు సామాజిక స్రవంతి మేళావించేలా తగు కార్యక్రమం కార్యాచరణకు క్యాలెండరును ఈ వారంలో ఆవిస్కరించనున్నామన్నారు.

ఈ సమావేశంలో కోమురోజు శ్రీనివాస్, అంబటి నర్సింగరావు, బోగోజు శ్రీనివాస్, షరీఫోద్దీన్, నారమల్ల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment