ప్రపంచంలో అనేక దేశాల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులను అధికారులకు తీసుకొచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ లు అన్నారు.
చౌటుప్పల్ ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం మూడవ మహాసభల్లో చివరి రోజైన మంగళవారం ముఖ్య అతిథులుగా మహాసభలో పాల్గొని వారు మాట్లాడుతూ పక్కనున్న శ్రీలంకలో, నేపాల్ లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారని ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించిందని, జర్మనీ స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కమ్యూనిస్టులు గెలిచారని అన్నారు. అమెరికా చుట్టూత ఉన్న వెనిజులా, అర్జెంటీనా లాంటి దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారన్నారు. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయిస్తూ తన సంక్షేవాన్ని ఇతర దేశాలపై రుద్దుతూ పూట గడుపుతుందన్నారు. దాన్ని అంటగాగుతున్న భారతదేశం అమెరికా కనుసన్ననల్లో కొనసాగిస్తుందని దేవుడి పేరుతో రాజకీయాలు చేసి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రారంభించినా మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఓడించారన్నారు. బిజెపి అనుసరిస్తున్న విభజన రాజకీయాలను తిప్పికొడుతూ వర్గ ఉద్యమాల్ని పెంచాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ, పెన్షన్ల రెట్టింపు, ప్రతి మహిళకు 2500 రూపాయలు, పెళ్ళికానుక ఇలాంటి వాటిని అమలు చేయలేదన్నారు.
ఈ మహాసభల్లో జిల్లా కార్యదర్శి ఎండి జాంగిర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, పైల్ల ఆశయ్య, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింలు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.