దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది

దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.

~ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

కాటారం, ఏప్రిల్ 08, సమర శంఖం ప్రతినిధి:- ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని దేశ భవిష్యత్తును దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని విద్యతో మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా సేవలందిస్తూ 26 సంవత్సరాలుగా ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి పిఆర్టియు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు జన్నపురెడ్డి ఉమారాణి ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమం స్థానిక కాటారం ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు హటకారు సమ్మయ్య వ్యవహరించగా, సభ సమన్వయకర్తగా సతీష్, రాజు నాయక్ లు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు.

ఈ సన్మానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి ఈ జిల్లాకు విచ్చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వృత్తుల్లో కెల్లా ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైనదని, ఈ వృత్తిలో ఉన్న గౌరవం మరే ఇతర వృత్తిలో లేదన్నారు. సుదీర్ఘకాలం 26 ఏళ్ల పాటు వివిధ పాఠశాలల్లో అంకితభావంతో పనిచేసే ఎందరో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఘనత ఉమారాణి కి దక్కుతుందని అన్నారు. ఎన్నో పదవులు స్వీకరించి రాష్ట్ర మహిళ అసోసియేట్ అధ్యక్షురాలుగా పనిచేస్తూ సంఘ అభ్యున్నతికి ఇదోదికంగా కృషి చేశారని ఉమారాణి సేవలను కొనియాడారు.

ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పిఆర్టియు సంఘం ముందంజలో ఉంటుందని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ధ్యేయంమని అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంతో సానుకూలమైన ఉత్తర్వులు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. అతి త్వరలోనే ఉపాధ్యాయులందరికీ నగదు రహిత హెల్త్ కార్డులను ఇప్పిస్తానని తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించిన విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ సిపిఎస్ ను రద్దు చేస్తూ, పాత పెన్షన్ విధానాన్ని వర్తించేలా ఉత్తర్వులు ఇప్పిస్తానని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలోనే మిగిలిపోయిన స్పౌజ్ బదిలీల ఆర్డర్లను ఇప్పించడంతోపాటు ఆగిపోయిన మ్యూచువల్ ఆర్డర్లను కూడా త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పిస్తారని తెలియజేశారు.

ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు శక్తివంచన లేకుండా పనిచేస్తూ వృత్తి నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి విద్యాబోధన చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడానికి తల్లిదండ్రులలో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

అనంతరం సన్మాన గ్రహీత ఉమారాణి కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిధి PRTUTS జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రేగురి సుభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమారాణి ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే కాటారం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను 100% నమోదు చేయించి జిల్లాలోనే ఒక మంచి పాఠశాలగా కాటారం పాఠశాలను తీర్చిదిద్దడంలో సఫలీకృతం అయ్యారని, ఈ సందర్భంగా ఉమారాణి సేవలను జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకొని వారి పాఠశాలను కూడా ఇదే స్ఫూర్తితో నడిపించాలని పిలుపునిచ్చారు.

PRTUTS జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో ఉద్యోగ విరమణ అనేది సహజమని, ప్రతి ఉద్యోగి 61 ఏళ్లకు ఉద్యోగ విరమణ ఉద్యోగపరంగా మాత్రమే విరమణ కానీ వృత్తి పరంగా మాత్రం వందేళ్లు తనకు అందుబాటులో ఉన్న విద్యార్థులకు భావితరాలకు ఇదే స్ఫూర్తితో వారిని విద్యావంతులు చేయడంలో తన వంతు సేవలు అందించాలని కోరారు.

అనంతరం పిఆర్టియు జిల్లా శాఖచే ఉమారాణి కి శాలువా పూలమాలతో సన్మానం చేసి జ్ఞాపకను బహుకరించారు.

మరొక ముఖ్య అతిథి జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ మాట్లాడుతూ పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ కనీసం సెలవులు కూడా తీసుకోకుండా సంవత్సరన్నర కాలంగా పని చేశారని వారు ఉద్యోగ విరమణ చేయడం భర్తీ చేయలేని లోటు అని వారి సేవలను కొనియాడారు..

ఈ కార్యక్రమంలో కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్, తిరుపతి లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వరంగల్ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉమామహేశ్వర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ బాబు, జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు కాయిత లక్ష్మణ్, దుప్పటి రాజగోపాల్, సామల రమేష్, కిషన్ రెడ్డి లతో పాటు కాటారం మండల విద్యాశాఖ అధికారి శ్రీదేవి, గెజిటెడ్ హెడ్మాస్టర్లు పింగిలి విజయపాల్ రెడ్డి, అశోక్ కుమార్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment