కోర్టు స్టే ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. అధికారుల సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశం..పేదల ఇల్లు అయినందున కూల్చివేశారని, ధనవంతుల అక్రమ నిర్మాణాలు కూల్చివేసే ధైర్యం ఉందా అని నిలదీసిన హైకోర్టు
నాగర్ కర్నూల్ – దోమల పెంటలో కటకం మహేశ్, నాగలక్ష్మిలు ఇంటిని నిర్మించుకుని చాలా ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అందులో చిన్న కిరాణా దుకాణం నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
అయితే అక్రమ నిర్మాణమంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూల్చివేయడంతో.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.
కూల్చివేత చేపట్టరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ ఉత్తర్వులుండగానే ఇంటిని కూల్చివేయడంతో మహేశ్, నాగలక్ష్మిలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో నిర్మాణాన్ని పంచాయతీ కార్యదర్శి సొంత ఖర్చుతో పునరుద్ధరించాలని, పరిహారం, శిక్ష గురించి తరువాత పరిశీలిస్తామంటూ విచారణను వాయిదా వేసిన కోర్టు.