చిన్న కొండూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం
సోమవారం రోజున చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. గ్రామ అధ్యక్షునిగా చీమకండ్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా తీగుళ్ల బాలకృష్ణ, ఉపాధ్యక్షులు చింతపల్లి వెంకటరెడ్డి, శ్రీశైలం, దోర్నాల నరేష్, కోశాధికారి లక్క స్వామి, సహాయ కార్యదర్శిగా చెక్క యాదయ్య, చంద్రయ్య, ఆర్గనైజర్ సాయికిరణ్, సభ్యులుగా చెక్క ఎల్లమ్మ, వెంకటేష్, శ్రీనివాస్, లచ్చిరెడ్డి, మాజీ అధ్యక్షులు జంగయ్య, వార్డు సభ్యులు సత్తిబాబు సత్తిబాబు, నరసింహ, శ్రీకాంత్, మధు ఈ సమావేశంలో ఉన్నారు.