కార్పొరేషన్‌ గుత్తేదారుడి నిర్లక్ష్యం, యువకుడు మృతి

కార్పొరేషన్‌ గుత్తేదారుడి నిర్లక్ష్యం, యువకుడు మృతి

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గుత్తేదారుడి నిర్లక్ష్యానికి శుక్రవారం రాత్రి ఒక యువకుడు బలయ్యాడు. రాజమహేంద్రవ రం వీవీ గార్డెన్స్‌కు చెందిన పాస్ట్‌ర్‌ కన్నాన్‌ రాజు కుమారుడు కాకర్లపూడి విజయరూపస్‌ ఎంబీఏ చదువుకున్నాడు. పార్ట్‌టైం జాబ్‌గా ప్లవర్‌ డెకరేషన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక ఫంక్షన్‌కు ఫ్లవర్‌ డెకరేషన్‌ నిమిత్తం ఫ్లవర్స్‌ కొనుగోలు చేసేందుకు వీవీ గార్డెన్స్‌ నుంచి బైక్‌పై బయలు దేరాడు. గోరక్షణ పేట సెంటర్‌కు వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద రోడ్డుకు అడ్డంగా రెండు భారీ పైప్‌లు పెట్టిఉండడాన్ని గమనించలేకపోయాడు.నేరుగా పైప్‌లను బైక్‌తో ఢీకొట్టడంతో బైక్‌ హ్యాండిల్‌ తలకు ,చాతికి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. కార్పొరేషన్‌ వేస్ట్‌ వాటర్‌ పైప్‌లైన్‌ వేసేందుకు రెండు భారీ పైప్‌లను తీసుకువచ్చిన గుత్తేదారుడు వాటిని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డు పెట్టుకుండా వదిలేశాడు. పైప్‌లు రెండు నలుపురంగులో ఉండడం వల్లన బైక్‌పై వచ్చిన రూపస్‌కు కనిపించలేదు. దీంతో వాటిని ఢీకొట్టి మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేశారు. కార్పొరేషన్‌ గుత్తేదారుడి నిర్లక్ష్యం కారణంగానే రూపస్‌ మృతి చెందాడని.. న్యాయం చేయాలని డిమాం డ్‌ చేశారు. సంఘటనా స్థలాన్ని వన్‌టౌన్‌ సీఐ మురళీకృష్ణ పరిశీలించి మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశా మని వన్‌టౌన్‌ సీఐ పేర్కొన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ తదితర అంశాలు పరిశీలిస్తున్నా మన్నా రు.ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే వారిపై చర్యలు తీసు కోవాలని ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆదేశించారని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment