ఉపాది పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

ఉపాది పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

ఉపాధి పనులో కూలీల సంఖ్య పెంచాలని డిఆర్ డిఏ పిడి జయదేవ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని అలిరాజుపేట గ్రామంలో నర్సరీ, ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం మండల కార్యాలయంలో మండల శాఖ అధికారులు, ఈజీఎస్ సిబ్బందితో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలన్నారు. ప్రతి గ్రామంలో 25 మందికి తగ్గకుండా ఉపాధి పనులకు వచ్చే విధంగా ఫిల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని తెలిపారు. మండలంలోని వంద ఎకరాల్లో ఆర్టికల్చర్ పనులను చేపట్టాలని కోరారు.

అలాగే పశువుల పాకలు, పంట పొలాలకు రోడ్ల నిర్మాణ పనులు తదితర పనులను ఉపాధి కూలీలతో చేయించాలని సూచించారు. ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సంబంధించిన కిట్టు, నీడ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధి పనుల వద్ద పిల్డ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండి కూలీలకు అవసరమైన వాటిని సమకూర్చాలని సూచించారు. లేని అసిస్టెంట్లపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఎంపీ ఓ ఖాజా మోహినిద్దీన్, ఏపీవో శైలజ, కార్యదర్శిలు సిబ్బంది పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment