అయ్యప్ప దేవాలయ కమిటీలో గొడవలు దుర్భాషలు ఆడుకున్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పెద్ద చెరువు పరిధిలోని శబరి నగర్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం రోజు నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు చింత రవీందర్ పై దుర్భాషలాడితూ గొడవకు దిగడం జరిగింది. ఇదేమిటని రవి అడగగా నువ్వేంవడివి అంటూ నానా బూతులు తిడుతూ గొడవకు దిగడంతో వ్యవస్థాపక అధ్యక్షులు అయిత రాములు మంచాల ప్రభాకర్ కల్పించుకొని ఇరువురిని గొడవ పడకుండా ఆపారు. ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో అవకతవకలపై గొడవ జరిగినట్లు ఉపాధ్యక్షులు తెలిపారు. అయ్యప్ప స్వాములకు నిత్యం పెడుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అధ్యక్షులు కల్పించుకొని ఆలయానికి విచ్చేసిన అయ్యప్ప స్వాముల పై గొడవకు దిగడం సరికాదని అన్నందుకు నాపై అధ్యక్షులు గొడవకు దిగరని ఉపాధ్యక్షులు తెలిపారు. పలువురు అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో బిక్ష ఒకసారి పెట్టి రెండవసారి పెట్టకపోవడం కూరగాయలు మరలా వడ్డించమని అడిగితే లేవని చెప్పడం పాపడాలు వేయకపోవడం వంటి విషయంలో అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వాములకు పెట్టే బిక్షలో ఎలాంటి అవకతవకలు తప్పులు జరగకుండా ఇలాంటి విషయాలు మరల పునరావతం కాకుండా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని స్వాములు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment