ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి….పోలీసుల నిర్బంధంతో శాంతియుత పోరాటాన్ని ఆపలేరు… ప్రజా పాలనలో మహిళలకు దక్కని గౌరవం.. బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూమోల్ల కృష్ణయ్య 

 

ఆశా కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ,రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమంటే, పోలీసుల నిర్బంధంతో వారి శాంతియుత పోరాటాన్ని అణిచివేయడం ఏంటని? బి ఆర్ టి యు .వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టైగర్ భూమోల్ల. కృష్ణయ్య తెలంగాణ గ్రామీణ ఆరోగ్య ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు. మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటపల్లి అనిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, పోలీసు అధికారులను, ప్రశ్నించారు ? వికారాబాద్ జిల్లాలో బి ఆర్ టి యు అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులను ,సభ్యులను ,అర్థరాత్రి రెండు గంటల నుండి, జిల్లాలోని అన్ని గ్రామాలనుండి, అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ని వందలాది మంది ఆశ కార్యకర్తలను దౌర్జన్యంగా, బలవంతంగా, అరెస్టులు చేసి, నిర్బంధించడం ఏంటని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన ఆశ కార్యకర్తలల్లో అనేకమంది చంటిపిల్లల తల్లులని చూడకుండా, బాలింతలని చూడకుండా, మా పిల్లలను బడికి పంపాలని, మా భర్తలకు వంటలు చేసి టిఫిన్లు కట్టాలని చెప్పిన వినకుండా, మేము ధర్నాలకు వెళ్లడం లేదని, మేము నిన్ననే మా ఆందోళన, పోరాటం ముగిసిందని, చెప్పినా వినకుండా, అర్ధరాత్రి వేళల్లో పోలీసులు మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ, అరెస్టులు చేసి, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తీవ్రమైన చర్యగా బి.ఆర్.టి.యు .భావిస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు పాలన, నిర్బంధ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కార్మికులకు నిరసన చెప్పే హక్కు, ఆందోళన, పోరాటాలు, చేసే హక్కులు లేవా? అని ప్రశ్నించారు. గతంలో ఇంత నిర్బంధ పాలనను ఎన్నడూ చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు, ఉద్యోగులకు, ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో , బి ఆర్ టి యు. కార్మికుల ఉద్యోగుల తరపున ఆందోళన, పోరాటలు, చేస్తూనే ఉంటామని వారు తేల్చి చెప్ప్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న కార్మికులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రజలకు , రైతులకు, మహిళలకు, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గోరంగా విఫలం చెందారని, విమర్శించారు.సచివాలయంలో ఒకపక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ మరోపక్క రాష్ట్రంలో మహిళలపై నిర్బంధకాండము కొనసాగించడం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆశా కార్మికులకు, అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు, గ్రామపంచాయతీ ఉద్యోగులకు, ఆటో కార్మికులకు, బీడి ,చేనేత కార్మికులకు, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులకు అండగా, పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు, చేపడుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిర్బంధ పాలనను, పోలీస్ పాలనను, ఆపాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment