బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయం-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల 

బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయం-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల

చౌటుప్పల్  మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన 12వ, వార్డు మాజీ కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తంగడపల్లి రోడ్ లో ఉన్న పి బి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. 11 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. రాబోయే మున్సిపల్, సంస్థ గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నుంచి తాడూరి పరమేష్ పార్టీలో ఉంటూ ప్రజలకు నిత్యం సేవలందిస్తున్నటువంటి పరమేశ్ ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పని చేసిన వారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల 12వ, వార్డులో కౌన్సిలర్ గా గెలుపొంది ప్రజలకు నిత్యం సేవలందించి, పదవీకాలం పూర్తి అయినా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్న మాజీ కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు తోర్పూనూరి నరసింహ, తంగడపల్లి మాజీ సర్పంచ్ ఎం దయాకరాచారి, చిన్నం బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment