వకీల్ సాబ్ వీరేందర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే “చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

---Advertisement---

వకీల్ సాబ్ వీరేందర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే “చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి వెంకట్రాంరెడ్డి

 నియోజకవర్గ రాజకీయాల్లో, రైతు పోరాటాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల కోసం న్యాయపోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా షాద్ నగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేత దివంగత తాండ్ర వీరేందర్ రెడ్డి పేరు చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోతుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే “చౌలపల్లి ప్రతాప్ రెడ్డి” కొనియాడారు. కీర్తిశేషులు తాండ్ర వీరేందర్ రెడ్డి అలియాస్ వకీల్ సాబ్ ద్వాదశ దినకర్మ సందర్భంగా కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామంలో ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, భీశ్వ కిష్టయ్య, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, బాబర్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి, సోమిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాజీ జెడ్పిటిసి వెంకట్రాంరెడ్డి, కందివనం సూర్యప్రకాష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, మైనార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం, ప్రముఖ న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, కరీం, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్, కంచి రాజగోపాల్, చెంది మహేందర్ రెడ్డి సబియా సుల్తాన, శ్రీనివాస్ రెడ్డి తదితరులు సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఎండి ఖాజా పాషా కేపీ, రాఘవేందర్ గౌడ్, కేశంపేట జర్నలిస్టులు లక్ష్మణ్, రమణ, ఆంజనేయులు, రామకృష్ణ, రాజశేఖర్, బొట్టు శీను తదితరులతో పాటు కృష్ణ మహేష్ ప్రజాసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఖాదర్ గోరి, విద్యార్థి నేత జంగారి రవి, తదితరులు హాజరై వీరేందర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వీరేందర్ రెడ్డి సేవలను కొనియాడారు. నియోజకవర్గంలో న్యాయపరంగా రాజకీయంగా కాలుష్యకర పరిశ్రమలపై చేసిన పోరాటాలను అందరూ గుర్తు చేసుకున్నారు. వీరేందర్ రెడ్డి వారసుడు తాండ్ర శ్రావణ్ రెడ్డి, ఆయన సతీమణి కేశంపేట మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు..

Join WhatsApp

Join Now

Leave a Comment