క్రీడల్లో నేర్చుకునే పోరాట స్ఫూర్తి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఉపయోగపడుతుంది..పోలీసు క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

క్రీడల్లో నేర్చుకునే పోరాట స్ఫూర్తి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఉపయోగపడుతుంది..పోలీసు క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

ఇటీవల కరీంనగర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ మూడవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 లో రాచకొండ కమీషనరేట్ తరపున పాల్గొని పలు విభాగాల్లో బహుమతులు గెలుచుకున్న రాచకొండ అధికారులు మరియు సిబ్బందికి ఈ రోజు నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ క్రీడల్లో మొత్తం 56 వ్యక్తిగత పతకాలతో పాటు ఉమెన్స్ కబడ్డీలో బంగారు పతకం, మెన్స్ కబడ్డీలో రజత పతకం రాచకొండ పోలీసులు సాధించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ముఖ్య భాగం అని, వివిధ రకాల మానసిక శారీరక ఒత్తిడులను అధిగమించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ తరఫున రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించడం ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. పతకాలు గెలవడం ఓడిపోవడం అనేది ముఖ్యం కాదని, పోరాడడమే గొప్ప విషయం అన్నారు. అయితే క్రీడలతో పాటు ఉద్యోగ బాధ్యతల నిర్వహణకి ప్రతి ఒక్కరు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేయాలని కమిషనర్ అందరికీ సూచించారు.

రాచకొండ కమిషనరేట్ పోలీస్ సిబ్బందికి తమ విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులను మరియు వివిధ రకాల సవాళ్ల నుంచి ఉపశమనం పొందేలా మరియు నూతనత్తేజంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడానికి స్పోర్ట్స్ మీట్ లలో పాల్గొనడానికి అనుమతిస్తూ ప్రోత్సాహం ఇస్తున్నామని పేర్కొన్నారు. క్రీడా పోటీల ద్వారా వివిధ రకాల పోలీస్ విభాగాల మధ్య సుహృద్భావ వాతావరణం మరియు సమిష్టితత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడా పోటీలో పాల్గొనడం ద్వారా సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పని చేసే అవకాశం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. పోలీసులు వివిధ క్రీడల్లో తమకున్న ప్రత్యేక ప్రతిభను ఇటువంటి పోటీల్లో పాల్గొని ప్రదర్శించాలని దాంతోపాటు ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కూడా అదే అంకితభావాన్ని ప్రదర్శించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహా రెడ్డి, Head quarter DCP Shyam, SOT addl DCP Nandyala Narasimha Reddy, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, ఏసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment