బెట్టింగ్ యాప్‌ల నిజమైన స్వరూపం

బెట్టింగ్ యాప్‌ల నిజమైన స్వరూపం

అసలు బెట్టింగ్ యాప్‌లు ఎలా పని చేస్తాయి? వాటి అల్గోరిథం ఏమిటి? వాటి ఎజెండా ఏమిటి?

ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్‌ల వెనుక పెద్ద మాఫియా ఉంటుంది, వాటిని బ్యాన్ చేయడం ఇంపాసిబుల్.బెట్టింగ్ యాప్‌లను భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి ఫ్రీలాన్స్ చేసే డెవలపర్‌లతో తయారు చేయిస్తారు.జస్ట్ గేమ్‌లను మాత్రమే డెవలపర్‌లతో రూపొందించించి, అవి కూడా ట్రికీ అల్గోరిదంతో ఈ గేమ్‌లను వీళ్ల వెబ్‌సైట్‌లో ఇన్‌బిల్ట్ చేస్తారు. యాప్ మెయింటెన్స్‌ కోసం పెద్ద టీమ్‌లు ఉంటాయి.

మీరు గేమ్‌ను కొత్తగా ప్రారంభించిన తర్వాత కొన్ని సార్లు కంపల్సరీగా యూజర్‌నే విన్ అయ్యేలా సెట్ చేస్తారు.డబ్బు వస్తుందనే భావనతో మీరు మళ్లీ మళ్లీ బెట్టింగ్ చేస్తారు. ఇక్కడ గాంబ్లింగ్ మొదలవుతుంది.మీరు ఐదు సార్లు గేమ్ ఆడితే, కేవలం రెండు సార్లు మాత్రమే విన్ అయ్యేలా అల్గోరిదం సెట్ చేస్తారు.

ఐపీఎల్ బెట్టింగ్ రేషియో కూడా ఇదే విధంగా వాడికి నచ్చినట్లు మారుస్తాడు. వీళ్ల బిజినెస్‌లో మెయిన్ పార్ట్ మార్కెటింగ్ & బ్యాంక్ అకౌంట్లు.
గ్రామాలు, నిరక్షరాస్య దేశాల్లో ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేయించి, వాటి వివరాలను వీళ్ల దగ్గర ఉంచుకుంటారు (లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు సృష్టిస్తారు).

పేమెంట్ చేసే ప్రతి సారి కొత్త QR కోడ్ వస్తుంది. అలాగే, ట్రాన్సాక్షన్ ఐడీ కూడా వెరిఫికేషన్ కోసం అడుగుతారు.ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ల అకౌంట్లు దొరికితే, మీ ట్రాన్సాక్షన్లు కనపడతాయి. అప్పుడే మీ ఖాతాను కూడా చెక్ చేస్తారు.

ఈ యాప్స్ బ్యాన్ చేస్తే బెటర్ కదానే సూచనకు ‘‘అవి ప్లేస్టోర్‌లో దొరకవు, వాటిని ఎలా, ఎక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలో కూడా ఇన్‌ఫ్లుయెన్సర్లే చెబుతారు… సో, అబ్రకదబ్ర అనేసి బ్యాన్ పెట్టేసి, తీసిపారేయలేం…’’

మీకో విషయం తెలుసా? మీ వ్యక్తిగత డేటాను కూడా వారు ఇతర వెబ్‌సైట్‌లకు విక్రయిస్తారు (ఉదా: యూజర్ వివరాలు, పాన్ కార్డు వివరాలు, బ్యాంక్ వివరాలు).
బెట్టింగ్ యాప్‌లను ప్రొమోట్ చేసే వాళ్లది ఎంత తప్పో, వాటిని ఉపయోగించే వాళ్లది కూడా అంతే తప్పు.
కష్టపడకుండా వచ్చే డబ్బు ఎప్పటికీ మన సొంతం కాదు.

Join WhatsApp

Join Now

Leave a Comment