పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పీఏసీ ఛైర్మెన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం కూకట్పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలో కల్యాణ లక్ష్మి ,షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 50 మంది లబ్ధిదారులకు 50లక్షల05 వేల 800 రూపాయల ఆర్థిక సహాయాన్ని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఆయన అందచేశారు.

ఈ సందర్బంగా పీఏసీ చైర్మన్ గాంధీమాట్లాడుతూ ..పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, మారేళ్ల శ్రీనివాస్, పురెందర్ రెడ్డి, కావూరి అనిల్, ఎల్లం నాయుడు పోశెట్టి గౌడ్ ,శ్రీనివాస్ రెడ్డి, శ్రావణి రెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment