సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

*రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి..*

సూర్యాపేట సమీపంలోని బీపీ గూడెం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

వివరాల ప్రకారం ఆత్మకూరు (S) మండలం కోట పహాడ్ గ్రామంలో పండుగకు హాజరై హైదరాబాద్ వెళ్లుచుండగా బీబీగూడెం గ్రామ శివారులో గల విజేత పైపుల కంపెనీ ముందు ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సుని డీ కొట్టడంతో తొర్రూరు మండలం కాంటెయ్యపాలెం కి చెందిన గడ్డం రవీందర్ (34) అతని భార్య రేణుక (28), వారి కూతురు రిషిత(8) అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో మొత్తం ఏడుగురు ఉన్నట్టు గుర్తించారు.
నలుగురు పిల్లల పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలింపు. మృతుడు రవీందర్ హైదరాబాద్ లో నివాసం ఉంటూ కార్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment