తెలంగాణలో బీర్ కంపెనీల నిబంధనల మేరకు అప్పటి BRS ప్రభుత్వం 2018లో 11% మేరకు, మళ్లీ 2022లో 7.5% శాతం మేరకు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. కానీ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కంపెనీల అడ్డగోలు చర్యలకు చెక్ పెట్టారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఒక్కో బీర్ బాటిల్కు కనీసం ₹10 చొప్పున పెంచాలన్న కంపెనీల ప్రతిపాదనలను ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరాదని గట్టి వైఖరి తీసుకుందని పేర్కొంటున్నాయి. ఇది ప్రజా ప్రభుత్వం సంచలన నిర్ణయమని అభిప్రాయ పడుతున్నాయి.
ఇది ప్రజా ప్రభుత్వ సంచలన నిర్ణయం’
Published On: January 9, 2025 10:48 am
