తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పై తాజా అప్డేట్ ఇదే..!

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పై తాజా అప్డేట్ ఇదే..!

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా స్పష్టత లేనట్లు తెలుస్తోంది.

కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించేందుకు చట్టబద్ధత కల్పించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపినప్పటికీ, ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదని సమాచారం.

తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదని పేర్కొనడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే, తాజా వ్యాఖ్యలతో ఎన్నికల షెడ్యూల్‌పై అనిశ్చితి మరింత పెరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment