యూజర్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడంతో పాటు భద్రతాపరంగానూ వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాప్ లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్ సాంకేతికత అందుకోలేని పాత ఫోన్లకు తన సపోర్ట్ను నిలిపివేస్తూ ఉంటుంది. కొత్త ఏడాదిలోనూ కొన్ని ఫోన్లకు వాట్సప్ సేవలు నిలిచి పోనున్నాయి.ఇప్పటికీ యూజర్లు ఆ ఫోన్లు వాడుతుంటే కొత్త ఫోన్లకు అప్ గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. దాదాపు 9-10 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఓఎస్ లో పనిచేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి వాట్సప్ తన సేవలను నిలిపివేయనుంది. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు వాట్సప్ వేదికగానూ మోసాలకు పాల్పడుతున్న వేళ.. పాత ఫోన్లలో వాట్సప్ వాడకం శ్రేయస్కరం కాదు. ఈ క్రమంలోనే ఆయా ఫోన్లకు వాట్సప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది. ఐఓఎస్ 15.1, అంతకంటే పాత వెర్షన్లు వాడుతున్న ఐఫోన్లకూ తన సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ పాత ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు వాడుతుంటే వారు కూడా కొత్త ఫోన్ లకు అప్ గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.ఐఫోన్ యూజర్లకు మే 5 వరకు గడువు ఉంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్, మోటో జీ, హెచ్ఎసీ వన్ఎక్స్, హెచ్ఎసీ వన్ ఎక్స్+, హెచ్ఎసీ డిజైర్ 500, హెచ్ఎసీ డిజైర్ 601, శాంసంగ్ గెలాక్సీ నోట్2, శాంసంగ్ గెలాక్సీ ఎస్4 మినీ, మోటో రేజర్ హెచ్డ్, మోటో ఈ 2014, ఎలీ ఆప్టిమస్ జీ, ఎలీ నెక్సస్ 4, ఎలీ జీ2 మినీ, ఎలీజీ ఎల్ 90, సోనీ ఎక్స్పీరియా జడ్, సోనీ ఎక్స్పీరియా ఎస్పీ, సోనీ ఎక్స్ పీరియా టీ, సోనీ ఎక్స్పీరియా వి తదితర ఫోన్లు ఉన్నాయి. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ ఫోన్లు ఇప్పటికీ వాడుతుండడం అరుదు. ఒకవేళ ఎవరైనా వాడుతుంటే మాత్రం వాట్సప్ సేవల కోసం కొత్త ఏడాదిలో కొత్త ఫోన్కు మారాల్సిందే!
జనవరి నుంచి ఈఫోన్ల లో వాట్సప్ సేవలు బంద్…జాబితా ఇదే..
by Sravan Kumar
Published On: December 23, 2024 8:10 pm
---Advertisement---