వికారాబాద్ జిల్లా..కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో జరిగిన ఘటన మరియు రైతులపై అదేవిధంగా వారి తరఫున నిలిచిన మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసుల నుండి విముక్తి. రేవంత్ రెడ్డి ధన దాహానికి బలై, ఆదానికి మరియు అతని బంధువులకు కట్టబెట్టటానికి రైతుల పొలాలు లాక్కోవడానికి వచ్చిన అధికారులను వెనక్కి పంపిన రైతుల సంగతి మనకు తెలిసిందే. వారిపై అక్రమ కేసుల పెట్టి, బేడీలు వేసి, జైలుకు పంపి దాదాపు 37 రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై, రైతులు మరియు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విజయం సాధించి ఎట్టకేలకు బెయిలు పొందడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని వీరి ఫైల్స్ ని కోర్టులో ఆలస్యంగా అందజేసి చేసి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించడం జరిగింది. గతంలోనే నరేందర్ రెడ్డి పై పెట్టిన మూడు కేసులలో రెండింటి FIR లను కొట్టేయమని హైకోర్టు ఆదేశించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు మరియు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలను మానుకొని, రైతులకు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవే
ఇది లగచర్ల రైతుల విజయం– మెతుకు ఆనంద్…
Published On: December 19, 2024 11:37 am
