ఈ ఊరు చిన్నది కాదు, నాకు మార్గ దర్శకం..ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్

---Advertisement---

మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు,. గ్రామపంచాయతీ సభ్యులు..  ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి హెలికాప్టర్ చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఆయన సతీమణి డాక్టర్ సుదేశి దన్ కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ముందుగా కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్క నాటిన ఉప రాష్ట్రపతి. అక్కడే ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువులకు సంబంధించిన స్తాల్స్ పరిశీలించారు.. అనంతరం కేవికే లోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు.ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ సాగు పై దాదాపు 800 మంది రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి.

సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై పలువురు రైతులతో ముచ్చటించిన ఉప రాష్ట్రపతి, గవర్నర్.

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ..మెదక్ జిల్లాలో 655 మంది రైతు కుటుంబాలు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారు.వీళ్లంతా మూడు రోజుల పాటు డిల్లీలో నాకు అతిథులుగా రావాలి.ఈ ఊరు చిన్నది కాదు, నాకు మార్గ దర్శకం.

మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు, గ్రామపంచాయతీ సభ్యులు నా ప్రత్యేక అతిథులు.. వారికి డిల్లీ లో ఆతిధ్యం ఇస్తానని ఉపరాష్ట్రపతి అన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి లాల్ బహదూర్ శాస్త్రి, జై జావా న్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదంతో వాజ్ పాయ్, జై జావాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై ఆను సందాన్ నినాదంతో ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు.రాబోయే కొద్ది కాలంలోనే భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్నది.2001 లో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ నేతృత్వంలో కిసాన్ దివస్ ను ప్రకటించారు. త్వరలో రజతోత్సవం జరుపుకోబోతున్నది.

దేశంలోని 730 పై చిలుకు కృషి విజ్ఞాన కేంద్రాలు, 150 పై చిలుకు ఐకార్ సంస్థలు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలి.భారత ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే దేశం పురోభివృద్ధి చెందుతుంది.దేశంలోని ఇంధన, సహజ వనరులను అవసరం మేరకే వినియోగించుకోవాలి.గ్రామీణ వ్యవస్థలో తమ గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను ఒక యూనిట్ గా ఏర్పాటు చేసుకుని అక్కడే వినియోగించుకోవాలి.

ఆ ప్రాంతంలోనే విక్రయిస్తే ఆ గ్రామ వ్యవస్థ ఆర్థికంగా బాగుపడుతుంది.దేశంలో అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నా అనుకున్న విధంగా సాగులో మార్పులు రావడం లేదు.దేశంలో దాదాపు 10 కోట్ల మంది రైతులు ఉన్నారు.. ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు రైతులకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యతను మరవద్దు.ప్రభుత్వ విద్యుత్ సబ్సిడిలపై ఆధారపడకుండా సోలార్ ఎనర్జీ పై రైతులకు అవగాహన కల్పించాలి అని భారత దేశ రైతులు సాగులో ప్రపంచంలోనే శ్రేష్టమైన రైతులుగా ఎదిగేందుకు కెవికే, ఐకార్ లు కృషి చేయాలి.గాంధీజీ స్వదేశీ నినాద స్ఫూర్తితో ప్రధాని మోడీ ఫోకల్ ఫర్ లోకల్ పిలుపునిచ్చారు.1989 లో విదేశీ మరక ద్రవ్య నిలవల్తో పొలుచుకుంటే ఇప్పుడు 700 రేట్లు పెరిగింది.రైతులతో చర్చించి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలి.

ప్రతి భారతీయుడు జాతీయ వాదంపై విశ్వాసం ఉంచాలి. అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అన్నారు.

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ..ఆర్గానిక్ సాగు చేస్తున్న 800 మంది రైతులు ఈ సమ్మేళనం లో పాల్గొనడం ఆనందంగా ఉంది. రైతులు మళ్ళీ ఆర్గానిక్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు.రసాయనిక సాగును క్రమక్రమంగా తగ్గిస్తున్నారు.ఏకలవ్య కేవికె సంస్థ ఆర్గానిక్ సాగు దిశలో రైతులకు మేలైన సహకారం అందిస్తున్నదడం పట్ల అభినందించారు.రాబోయే రోజుల్లో మరింతగా ఆర్గానిక్ సాగు విస్తృతికి కృషి అవసరం.గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment