తిరుపతి: శ్రీ కోదండ రామస్వామివారికి రాగి ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

తిరుపతి: శ్రీ కోదండ రామస్వామివారికి రాగి ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

తిరుపతి, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:-తిరుప‌తి శ్రీ కోదండ రామస్వామి వారికి రూ.4.10 ల‌క్ష‌ల విలువైన బంగారు పూత వేసిన రాగి ఆభ‌ర‌ణాలను బుధవారం చెన్నైకి చెందిన శ్రీధర్, వారి కుటుంబ సభ్యులు కానుకగా సమర్పించారు. ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్నకు వీటిని అందించారు.

బహుకరించిన వాటిలో ఉత్స‌వ‌మూర్తుల‌కు అలంక‌రించే ఆరు హస్త కవచాలు, ఆరు పాద కవచాలు ఉన్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ సురేష్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment