నేడు మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్!
మహిళల టీ20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మలేషియాలోని కోలాలం పూర్,లోని బయుమాస్, ఓవల్ స్టేడియంలో ఈరోజు జరగనుంది,ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నా యి,అయితే, ఈసారి రెండు జట్లు అండర్-19 మహిళల టీ20, ప్రపంచ కప్ ఈ టైటిల్ పోరులో భారత జట్టు ఫేవరెట్‌గా నిలిచింది. వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.
ఇందులో భారత స్టార్ ఓపెనర్ త్రిష గోంగిడి కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తు న్నారు. ఆమె ఇప్పటివరకు మంచి ఫామ్‌లో కనిపిం చింది. ఫైనల్‌లో కూడా ఆమె బ్యాటింగ్‌తో తన ప్రతిభను ప్రదర్శించగలిగితే, 2023 తర్వాత టీమ్ ఇండియా మళ్ళీ ఈ ట్రోఫీని గెలుచుకోగలదు.
అలాగే త్రిష కూడా తన పేరు మీద ఒక మెగా రికార్డు సృష్టించగలదు భారత జట్టు బ్యాటింగ్‌కు త్రిష వెన్నెముకగా నిలి చింది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆమె 6 ఇన్నింగ్స్‌లలో 66.25 సగటుతో, 149 అద్భుత మైన స్ట్రైక్ రేట్‌తో 265 పరుగులు చేసింది.
ఈ సమయంలో.. ఆమె ఒక సెంచరీ కూడా చేసింది. 2025 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి. ఆమె తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన డెవినా పెర్రిన్ అత్యధిక పరుగులు చేసింది. పెరిన్ తన ఖాతాలో 176 పరుగులు చేసింది,
దీని అర్థం త్రిషకు దగ్గరగా ఉన్న బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. ఆమె ఈ రికార్డుతో టోర్నమెంట్‌ను ముగించ నుంది. ఇది మాత్రమే కాదు ఇంకో పెద్ద రికార్డును నెలకొల్పనుంది. ఈ టోర్నమెంట్ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత బ్యాట్స్‌మన్ శ్వేతా సెహ్రావత్ పేరు మీద ఉంది.