త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతుల ధర్నా: జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేత.

---Advertisement---

త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతుల ధర్నా: RRR అలైన్మెంట్ 40 కిలోమీటర్లకు మార్చాలని డిమాండ్.

చౌటుప్పల్ డిసెంబర్ 23 సమర శంఖమ్ :- 

చౌటుప్పల్, వలిగొండ, బోనగిరి త్రిబుల్ ఆర్ (RRR) భూ నిర్వాసిత రైతులు తమ అంగీకారంతో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, RRR అలైన్మెంట్ ని 40 కిలోమీటర్ల వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత సంఘం కన్వీనర్ చింతల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

భూములు కోల్పోయిన రైతులు, గతంలో 2017లో సర్వే చేయబడిన RRR అలైన్మెంట్ ను దివిస్ మరియు శ్రీని లాబరేటరీ కంపెనీల ఒత్తిడి కారణంగా మారుస్తున్నట్లు ఆరోపించారు. వారు, భూ సేకరణ చట్టం 2013 ప్రకారం రైతుల అంగీకారంతో భూములను తీసుకోవాలని, ఈ చట్టం అనుసరించి 80% రైతుల అంగీకారం తప్పనిసరి అని పేర్కొన్నారు.

 ఈ ప్రకారం, RRR ప్రాజెక్టు యొక్క దక్షిణ భాగం ORR (ఔటర్ రింగ్ రోడ్) నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకు తీసుకోవడం, ఉత్తర భాగంలో చౌటుప్పల్ దగ్గర 28 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు చెప్పిన రైతులు, ఈ అలైన్మెంట్ మార్పుతో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల రైతులు NH హైవేలు, విద్యుత్తు లైన్లు, నీటి కాలువలు తదితర అవసరాల కోసం తమ భూములను కోల్పోయినప్పటికీ, ఇప్పుడు కొత్తగా భూములు తీసుకోవడం వలన వారి జీవనోపాధి నిలిపివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా, భూ నిర్వాసిత రైతులు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి, RRR అలైన్మెంట్ మార్పు ద్వారా రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తంగళ్ళపల్లి రవీందర్ కుమార్, దబ్బేటి రాములు గౌడ్, అవిశెట్టి పాండు యాదవ్, జాల శ్రీశైలం యాదవ్, జాల నరసింహ, అంజయ్య, రాములు, జాల పార్వతమ్మ యాదవ్, బొమ్మిరెడ్డి ఉపేందర్ రెడ్డి, వల్లూరి భోగయ్య, దశరధ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

.

Join WhatsApp

Join Now

Leave a Comment