బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు

 

చౌటుప్పల్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వలిగొండ రోడ్డులో ఉన్న విగ్రహం వద్ద భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహానీయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పరిషత్ కూలంకషంగా పరిశీలించి 1949 సంవత్సరం నవంబర్ 26న ఆమోదించింది.1950 జనవరి 26వ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని నాటి నుంచి భారత దేశo గణతంత్ర దేశంగా మారింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక సందర్భానికి నవంబర్ 26 వ తేదీకి 75 ఏళ్ల పూర్తవుతున్నాయి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన విధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించిన ఘనత అంబేద్కర్ దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, దళిత సంఘాల నాయకులు బోదుల నరసింహ, ఆరుట్ల యాదయ్య, ఉదరి యాదయ్య, ఆరుట్ల యాదయ్య, పస్తం గంగ రాములు, సుక్క సుదర్శన్, చింతల సాయిలు, పస్తం శంకరయ్య, బోదుల రామచంద్ర,ఆరుట్ల లింగస్వామి, పురు శంకరయ్య, ఉదరి నరేష్ ,బోదుల స్వామి, బోదుల పరమేష్, కామిశెట్టి భాస్కర్, దొడ్డి రాములు, ఎర్రసాని సతీష్, ఉదరి రాకేష్, ఆరుట్ల విగ్నేష్, నందగిరి భీమయ్య, కాటేపల్లి శేఖర్,తదితరులు పాల్గొన్నారు…

 

Join WhatsApp

Join Now

Leave a Comment