రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో నూరుశాతం అమలు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో నూరుశాతం అమలు చేయాలి..

—–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి—-

నల్లగొండ డిసెంబర్ : 14 ( సమర శంఖమ్ )

 రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో నూరుశాతం అమలు చేయాలని , మెనూను ప్రతి పాఠశాలలో పాటించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా, మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో డైట్ చార్జీల పెంపు, కామన్ మెనూ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 40 శాతం డైట్ చార్జీల చార్ట్ ను ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇంత పెద్ద మొత్తంలో డైట్ చార్జీలను ఎప్పుడు పెంచలేదని, సరైన వంట సామాగ్రి లేక వంట ఏజెన్సీలు ,వంట మనుషులకు ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 40% డైట్ చార్జీలు పెంచడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను తు.చా తప్పకుండా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మెనూ నూటికి నూరు శాతం పాటించాలని, ఎలాంటి సాకులు చెప్పకూడదని, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె ఆదేశించారు. ప్రతి పాఠశాల వద్ద డైట్ చార్జిల వివరాలు ,అలాగే ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనం మెనూ వివరాలను అందరికీ కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పారు. పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ముఖ్యంగా ప్రతి విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్స్ పై కూడా దృష్టి పెట్టాలని ,ఎవరికైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్యుల దృష్టికి ,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పరిశుభ్రత, చదువు తదితర అంశాలపై సూచనలు చేశారు. అలాగే వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. గతంలో తాను ఇదే పాఠశాలను తనిఖీ చేసినప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, ఇందుకు ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిల ను ఆమె అభినందించారు. పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీ నిరంతరం భోజనాన్ని తనిఖీ చేయాలని, ఏ ఒక్కరు కలుషిత ఆహారం కారణంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పారు.

మండల ప్రత్యేక అధికారి, డిపిఓ మురళి, ఎంపీడీవో విజయభాస్కర్, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment