మెదక్ బ్యూరో:- సమర శంఖమ్
2021 నుండి 2024 వరకు స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ప్రదర్శన, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ కార్యక్రమాలు , సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మున్సిపాలిటీలకు సిఎస్సి మరియు MoHUA సంయుక్తంగా ఢిల్లీలో డిసెంబర్ 19 న సిల్వర్ హోక్ హాల్ లో ఏర్పాటు చేసిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో డా. సునీత నరైన్(CSE డైరెక్టర్) చేతుల మీదుగా చేంజ్ మేకర్ అవార్డు ను తూప్రాన్ పురపాలక సంఘ కమీషనర్ శ్రీ పాతూరి గణేష్ రెడ్డి ఆయన వెంట ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చింతల మధు పాల్గొని అవార్డు ను అందుకోవడం జరిగింది.