లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు!

కరీంనగర్, డిసెంబర్ 30 సమర శంఖమ్ :-

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులో నర్శింగ్ కాలేజి దగ్గర సైకిల్ పై వెళుతున్న ఇద్దరినీ లారీ ఢీ కొట్టింది. కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్న క్రమంలో రాజీవ్ నగర్ కు చెందిన గుడ్ల కౌసల్య(51)-రాజు(55) దంపతులను లారీ వేగంగా ఢీ కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు తీవ్ర గాయాలైన ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment