హైదరాబాద్ – శ్రీశైలానికి భూగర్భ రహదారి

  1. హైదరాబాద్ – శ్రీశైలానికి భూగర్భ రహదారి

హైదరాబాద్, మార్చి 08, సమర శంఖం ప్రతినిధి:-హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటివరకు భావించారు. ఈ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది. 30 అడుగుల లోతులో 62.5 కిలోమీటర్ల మేర నిర్మించేలా ఎలైన్మెంట్ లోను రూపొందించారు.

హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి ఒకటి. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లేవారు చాలామంది ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తుంటారు. అయితే, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తద్వారా వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది.

ఇందుకోసం కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా చేశారు. తాజాగా.. ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా రహదారి నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పారెస్టులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీశాఖ అనుమతులతో పాటు ఎన్టీసీఏ, జాతీయ పులుల సంరక్షణ మండలి అనుమతులు కూడా అవసరం ఉంటుంది.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు రాకపోకలకు నిషేధం ఉంది. పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం రాత్రివేళ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, తాజాగా.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్య ప్రాణులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

మార్గంమధ్యలో ఫర్హాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణాశాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీశాఖ తిరస్కరించింది. మార్గం మధ్యలో ఎక్కడా ర్యాంపులు ఉండొద్దని స్పష్టం చేసింది.

అటవీశాఖ అనుమతులు రావడం కష్టంగా మారడంతో హైదరాబాద్ – శ్రీశైలం రహదారి విస్తరణకు ఎలివేటెడ్ కారిడార్ కు బదులుగా భూగర్భ మార్గంపై కేంద్రం దృష్టి సారించింది. భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ, ఎన్టీసీఏ అనుమతుల సమస్య ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తోంది.

ఈ మేరకు అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొద్దివారాల్లో అధ్యయనం ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment