ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి – కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్.
సినీ ఇండస్ట్రీ పై పగబట్టిన సీఎం రేవంత్..
ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారు.ఈ సమస్య ముగిశాక అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించారు.. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారు రేవంత్ రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీని ఎంఐఎం నిండా ముంచింది.. ఎంఐఎంను నమ్మితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గతే పడుతుందన్నారు.
కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు. వారి కుటుంబాలను సీఎం ఏనాడైనా పరామర్శించారా.? అని హెద్దెవా చేశారు. ఆ మరణాలకు మీరు బాధ్యత వహించారా? మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అన్నారు. బండి సంజయ్. ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ వాపోయారు.