మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ చేసిన కేసు మాధవ్ పై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మ
వైసీపీ కీలక నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్ వంటి నేతలు కేసుల్లో బుక్ అయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చినట్టుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మాధవ్ కు భారీ షాక్ తగిలింది. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో వీడియో కాల్ లో అసభ్యకరంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. 2024 నవంబర్ 2న మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. మార్చి 5న విచారణకు హాజరుకావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాధవ్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద కేసు బుక్ చేశారు. తమ ముందు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.