మన్మోహన్ సింగ్ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు మన్మోహన్సింగ్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. “ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులు. వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆత్మీయులు. వారి నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శమైనవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.” వెంకయ్యనాయుడు అని అన్నారు.
మన్మోహన్ సింగ్ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు
Published On: December 27, 2024 8:06 am
