మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా భూసావల్ నగరంలో శుక్రవారం దారుణం జరిగింది. అమర్‌దీప్ టాకీస్ హోటల్‌లో తెహ్రీమ్ నాసిర్ షేక్ అనే యువకుడు టీ తాగుతున్నాడు. ఆ సమయంలో నలుగురు దుండగులు తుపాకులతో అక్కడకు వచ్చారు. తెహ్రీమ్ తలపై పలుమార్లు తుపాకీతో కాల్చారు. దీంతో తెహ్రీమ్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. హత్య తర్వాత నిందితులు గాల్లోకి తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పట్టపగలు యువకుడి దారుణ హత్య (వీడియో)
Published On: January 11, 2025 12:19 pm
