భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత మళ్ళీ రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. కోహ్లీ 2012లో చివరగా రంజీ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో ఆడబోతున్నాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. జనవరి 23 నుంచి మొదలయ్యే ఢిల్లీ, సౌరాష్ట్ర మ్యాచ్‌కు మెడనొప్పి కారణంగా విరాట్ అందుబాటులో ఉండట్లేదు. రైల్వేస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని కోహ్లీ తెలిపాడు.
13 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ
Published On: January 21, 2025 8:44 am
