వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు, పదిమందికి జరిమానా
వరంగల్, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:-మద్యం సేవించి వాహనాన్ని నడిపిన హనంకొండ రవీందర్ కు 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇక్కడి రెండవ శ్రేణి న్యాయమూర్తి ఎస్.ఫాతిమా చిన్నప్ప గురువారం తీర్పు వెలువరించారు.
వివరాలు ఇలాఉన్నాయి. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిఐ పి. నాగబాబు ఆధ్వర్యంలో మంగళ ,బుధవారాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పైన పేర్కొన్న వాహనదారుడు మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులకు దొరికిపోయారు. శ్వాస పరీక్ష నిర్వహించిన అనంతరం సదరు వ్యక్తి అధిక మోతాదు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుగా నిర్ధారణ అనంతరం కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు.
విచారణ అనంతరం సదరు వ్యక్తి అధిక మోతాదులో మద్యం సేవించి వాహనం నడపడం మోటారు వాహన చట్టం ప్రకారం నేరంగా పేర్కొంటూ రెండు రోజులు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించగా,కోర్టు ట్రాఫిక్ కానిస్టేబుల్ బి. కుమార్ ఆ వ్యక్తిని పరకాల సబ్ జైలుకు తరలించారు. అలాగే మోటారు వాహన చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడిపిన పదిమంది వ్యక్తులకు రూపాయలు 9,600/- జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.