పదోన్నతి పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ సిపి పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏ.ఎస్.ఐ లుగా విధులు నిర్వహిస్తూ ఎస్.ఐలు పదోన్నతి పొందిన సంపత్, యాదగిరి, విజయ్ కుమార్ లు మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ మార్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ వీలైనంత వరకు ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు భంగం కలిగించే రీతిలో వ్యవహరించవద్దని పోలీస్ కమిషనర్ తెలిపారు.