గుట్టను తొవ్వేస్తాం… మట్టిని అమ్మేస్తాం..ఇది మా మట్టి వ్యాపారం..

సంగెం గ్రామంలో* *అడ్డగోలుగా మట్టి దందా

రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం

ఎవ్వరికి చెప్పిన ఏమి చేయలేరంటూ వ్యాపారుల హెచ్చరికలు!

అక్రమ మట్టి వ్యాపారంపై గ్రామస్తుల ఆగ్రహం.

రాత్రి అయ్యిందంటే చాలు లింగన్న పలుగుట్టలో వాహనాల మోత..

 ఇది మా ప్రభుత్వం… ఇది మా గుట్ట.. మేము తొవ్వుకుంటాం… అమ్ముకుంటాం… వ్యాపారం చేస్తాం ఎవరికి ఫిర్యాదు చేసిన ఏమి చేయలేరు. ఇది మా దందా.. ఇది మా స్టైల్ అంటూ కేశంపేట మండలం సంగెం గ్రామంలో మట్టి వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. చీకటి పడిందంటే చాలు అక్రమంగా మట్టిని తీస్తూ తిప్పర్ల ద్వారా రియల్ వెంచర్ల అభివృద్ధి కోసం పట్టా భూములకు మట్టిని తరలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా యతెచ్చాగా మట్టి దందా కొనసాగుతున్న సంబంధిత శాఖల అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. సంగెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 220 లో గల కొంత ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన ఆరు మందికి 1 ఎకరం 31 గుంటల భూమిని ప్రభుత్వం గతంలో సాగు కోసం అసైన్డ్ చేసింది. అయితే ఆ భూమి లింగన్న పలుగుట్టకు ఉండడంతో సాగుకు నిరుపయోగంగా మారింది. ఇదే అదునుగా భావించిన మట్టి వ్యాపారస్తులు ఆ రైతులతో ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా మట్టిని తరలించేందుకు ఒప్పందం కుదిరించుకున్నారు. ఇందుకుగాను ఆ రైతులకు రూ. 1, 77,500 ఇచ్చే విదంగా గత ఏప్రిల్ నెలలో ఒప్పందం చేసుకొని తాజాగా మట్టి తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా చేపట్టే రెండు రియల్ ఎస్టేట్ వెంచర్లను చదును చేసేందుకు మట్టిని తరలిస్తున్నారని, అక్రమంగా మట్టిని తరలిస్తూ, సొమ్ము చేసుకుని సహజ సంపదను నష్టం చేస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రెవిన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి స్పందన లేదని, మా ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు ఆపుతారు ? అనే రీతిలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, మట్టి వ్యాపారస్తులు ప్రవర్తిస్తూ అక్రమ దందకు తెర లేపారని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, మట్టి వ్యాపారానికి వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment