అధికారంలో ఉన్నప్పుడు అదమరిచి నేడు విమర్శలేందుకు ఘటకేసర్ రైల్వే బ్రిడ్జ్ పనులపై ప్రజలను తప్పు దోవా పట్టించేందుకు ప్రతిపక్షాల కుట్రలు త్వరలోనే బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తాం – తోటకూర వజ్రెష్ యాదవ్

పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజ సమస్యలు పట్టించుకోకుండా మీన వేషాలు వేసి కాలం గడిపిన మల్లారెడ్డి నేడు అధికారం పోగానే ప్రభుత్వంపై,ముఖ్యమంత్రిపై చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పు దోవా పట్టించే కుట్రలు చేస్తున్నారని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు.

సోమవారం నాడు రైల్వే బ్రిడ్జ్ పనులను మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎం పరిశిం సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు ఎంపీగా,మంత్రిగా పది సంవత్సరాల పాటు అధికారం వెలగ బెట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏ ఒక్క రోజు కూడా రైల్వే బ్రిడ్జ్ పనులపై చిత్త శుద్ధితో ఒని చేయాలేదని నేడు రాష్ట్రంలో అధికారం పోగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించి కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభం అయ్యేలా చూశారని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో పనులు ఎందుకు కాలేదో సమాధానం చెప్పే దమ్ము లేని మల్లారెడ్డి నేడు చౌకబారు విమర్శలు చేస్తే ప్రజలు ఉరుకోరని అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఈ సమస్యపై ఎందుకు దృష్టి సారించలేదో ప్రజలకు సమాధానం చెప్పాకే దీక్షలకు సంఘీభావం చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటేల రాజేందర్ ను డిమాండ్ చేశారు.ఎది ఎమైన ఏప్రిల్ వరకు బ్రిడ్జ్ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్,ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రె రాజేష్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి,మాజీ ప్రజా ప్రతినిధులు, ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment